నాగశౌర్య కొత్త సినిమా టైటిల్‌ , ఫస్ట్‌లుక్‌ విడుదల

నేడు టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతని సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో తెరకెక్కుతున్న సినిమా పేరును నిర్మాత ఉషా ముల్పూరి ఖరారు చేశారు. అనీశ్ కృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకి ‘కృష్ణ వ్రింద విహారీ’ అనే పేరు పెట్టారు. కృష్ణ, వ్రింద మధ్య సాగే ప్రణయ ప్రయాణమే ఈ సినిమా. ఈ చిత్రంతో షిర్లే సేతియా హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. రాధిక, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మాజీ, సత్య తదతరులు ఇందులో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్.

గత ఏడాది ద్వితీయార్థంలో నాగశౌర్య నటించిన ‘వరుడు కావలెను’, ‘లక్ష్య’ చిత్రాలు విడుదలయ్యాయి. విశేషం ఏమంటే.. ఈ రెండు సినిమాలు కూడా జనవరి 6వ తేదీ రెండు వేర్వేరు ఓటీటీలలో ఒకేరోజున స్ట్రీమింగ్ అయ్యాయి.

CLICK HERE!! For the aha Latest Updates