HomeTelugu Reviews'రంగరంగ వైభవంగా' మూవీ రివ్యూ

‘రంగరంగ వైభవంగా’ మూవీ రివ్యూ

Ranga ranga vaibhavamga mov

టాలీవుడ్‌లో ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌. తొలి సినిమాతోనే విజయం సాధించిన వైష్ణవ్‌ రెండో సినిమా ‘కొండపొలం’మాత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో కొంత గ్యాప్‌ తీసుకున్న వైష్ణవ్‌.. తాజాగా ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది. ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్‌ 2) ఈ చిత్రం విడుదలైంది.

కథ: రిషి(వైష్ణవ్‌), రాధ(కేతికా శర్మ) చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. ఇరు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉంటుంది. కానీ రిషీ, రాధలకి మాత్రం ఒకరంటే ఒకరు పడదు. తరచూ గొడవ పడుతుంటారు. వీరి వయసుతో పాటు గొడవలు కూడా పెరుగుతూనే వస్తాయి. పెద్దయ్యాక వీరిద్దరు ఓ మెడికల్‌ కాలేజీలో చేరతారు. అక్కడ కూడా వీరిద్దరు గొడవ పడుతూనే ఉంటారు. అయితే రిషీకి మాత్రం రాధపై అమితమైన ప్రేమ ఉంటుంది కానీ.. పైకి కోపంగా ఉంటాడు. వీరిద్దరు కలిసే సమయానికి ఇరు కుటుంబాల మధ్య గొడవలు మొదలవుతాయి. అసలు ఆ గొడవలకు కారణం ఏంటి? తమ కుటుంబాలను కలపడం కోసం రిషీ, రాధలు ఏం చేశారు? చివరకు రిషీ, రాధల ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ.

Ranga ranga vaibhavamga 1

నటీనటులు: హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. పాటలు, విజువల్స్ బావున్నాయి. దర్శకుడు ఎంచుకున్న కథ, స్క్రీన్‌ప్లే, ఎమోషన్స్ పండకపోవడం, సెకెండాఫ్, తేలిపోయిన క్లైమాక్స్ ఈ చిత్రానికి మైనస్‌గా మారాయి. సర్పంచ్ సత్తిబాబుగా సత్య చేసే కామెడీ నవ్వులు పుయిస్తాయి. ప్రభు, నరేశ్‌ అలీ, సుబ్బరాజు, నవీన్‌ చంద్ర మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

విశ్లేషణ: ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాని తమిళంలో రీమేక్‌ చేసిన దర్శకుడు గిరీశాయ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేసిన తొలి చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ‘రంగ రంగ వైభవంగా’ తెరకెక్కించారు. వైష్ణవ్‌, కేతికా శర్మ పాత్రల చైల్డ్‌హుడ్‌ సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతోంది. మెడికల్‌ స్టూడెంట్స్‌గా వైష్ణవ్‌, కేతికా శర్మలో కాలేజీలో జాయిన్‌ అయిన తర్వాత కథంతా సరదాగా సాగుతుంది. రిషీ, రాధల మధ్య వచ్చే రొమాంటిక్‌ సీన్స్‌ ఆకట్టుకుంటాయి. సత్యతో వచ్చే సీన్స్‌ కూడా నవ్వులు పూయిస్తుంది. కావాల్సిన కామెడీ ఉన్నప్పటికీ.. కథనం మాత్రం రొటీన్‌గా సాగడం మైనస్‌.

ఇక సెకండాఫ్‌లో మాత్రం కథంతా సింపుల్ గా సాగుతుంది. మెడికల్ క్యాంపులో భాగంగా హీరో హీరోయిన్లు గ్రామానికి వెళ్ళడం.. అక్కడ మళ్ళీ ఇద్దరు కలవడం, తమ ఫ్యామిలీలను కలిపేందుకు ప్లాన్ చేయడం.. ఇలా రొటీన్ గా సాగుతుంది. అలానే కార్తీక దీపం సీరియల్ సీన్తో ఇద్దరి తల్లులను కలపడం ఆకట్టుకుంటుంది. ఎన్నికల సీన్ సాగదితగా ఉంటుంది. ఈ సినిమాలోని కొన్ని సీన్లు గతంలో వేరే సినిమాలను గుర్తు చేసేలా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు కాపీ కొట్టినట్లు అనిపిస్తుంది.

Ranga ranga vaibhavamga 2
టైటిల్‌ : రంగరంగ వైభవంగా
నటీనటులు : వైష్ణవ్‌ తేజ్, కేతికా శర్మ, ప్రభు, నరేశ్‌ అలీ, సుబ్బరాజు, సత్య తదితరులు
నిర్మాత: బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌
దర్శకత్వం: గిరీశాయ
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్‌

హైలైట్స్‌‌: హీరోహీరోయిన్‌ల కెమిస్ట్రీ
డ్రాబ్యాక్స్‌: రొటీన్‌ కథనం

చివరిగా: రొటీన్ డ్రామా ‘రంగరంగ వైభవంగా’
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu