HomeTelugu Trendingఈశా అంబానీ దంపతులకు లతా మంగేష్కర్‌ సర్‌ప్రైజ్‌

ఈశా అంబానీ దంపతులకు లతా మంగేష్కర్‌ సర్‌ప్రైజ్‌

1 16నూతన దంపతులు ఈశా అంబానీ- ఆనంద్‌ పిరామల్‌లకు లెజండరీ గాయని లతా మంగేష్కర్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల వీరిద్దరి వివాహ వేడుకకు లతా హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో తనదైన శైలిలో లతా కొత్త జంటకు ఆశీర్వాదాలు అందించారు. గాయత్రి మంత్రం, వినాయక స్తుతి ఆలపించి వాటిని ఈశా-ఆనంద్‌లకు అంకితం చేశారు. ఈ పాటలను వివాహ వేడుకలో ప్రసారం చేశారు. చాలా ఏళ్ల తర్వాత ఈశా-ఆనంద్‌ల కోసమే ఈ పాటలకు గాత్రం అందించారు లతా.

డిసెంబర్‌ 12న ఈశా-ఆనంద్‌ల వివాహం ముంబయిలోని ముఖేశ్‌ నివాసం యాంటీలియాలో అంగరంగ వైభవంగా జరిగింది. బాలీవుడ్‌ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తదితరులు వివాహ వేడుకకు విచ్చేశారు. శుక్రవారం రాత్రి ముంబయిలో ఘనంగా వివాహ విందును ఏర్పాటుచేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!