ఈశా అంబానీ దంపతులకు లతా మంగేష్కర్‌ సర్‌ప్రైజ్‌

నూతన దంపతులు ఈశా అంబానీ- ఆనంద్‌ పిరామల్‌లకు లెజండరీ గాయని లతా మంగేష్కర్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల వీరిద్దరి వివాహ వేడుకకు లతా హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో తనదైన శైలిలో లతా కొత్త జంటకు ఆశీర్వాదాలు అందించారు. గాయత్రి మంత్రం, వినాయక స్తుతి ఆలపించి వాటిని ఈశా-ఆనంద్‌లకు అంకితం చేశారు. ఈ పాటలను వివాహ వేడుకలో ప్రసారం చేశారు. చాలా ఏళ్ల తర్వాత ఈశా-ఆనంద్‌ల కోసమే ఈ పాటలకు గాత్రం అందించారు లతా.

డిసెంబర్‌ 12న ఈశా-ఆనంద్‌ల వివాహం ముంబయిలోని ముఖేశ్‌ నివాసం యాంటీలియాలో అంగరంగ వైభవంగా జరిగింది. బాలీవుడ్‌ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తదితరులు వివాహ వేడుకకు విచ్చేశారు. శుక్రవారం రాత్రి ముంబయిలో ఘనంగా వివాహ విందును ఏర్పాటుచేశారు.