లావణ్య కెరీర్ అయిపోయినట్లేనా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. అందుకే తొందరగా స్టార్ హోదా అనుభవించాలని తహతహలాడుతుంటారు. వీరిలో కొందరు సక్సెస్ అవుతుంటే మరికొందరు మాత్రం అరకొర అవకాశాలతో కాలం గడుపుతున్నారు. అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయిన లావణ్య త్రిపాఠికి మంచి అవకాశాలే లభించాయి. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, శ్రీరస్తు శుభమస్తు చిత్రాలతో వరుస విజయాలను
అందుకుంది.

అయితే ఈ ఏడాది వచ్చి ‘రాధ’,’మిస్టర్’ చిత్రాలు పరాజయం కావడంతో లావణ్య బాగా అప్ సెట్ అయింది. కనీసం చైతుతో కలిసి నటించిన ‘యుద్ధం శరణం’ సినిమా హిట్ అవుతుందని ఆశిస్తే అది కూడా నిరాశనే మిగిల్చింది. దీంతో లావణ్య ఏమి తోచని పరిస్థితుల్లో ఉంది. అసలు ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనే ముద్ర పడితే ఇక అవకాశాలు రావడం కష్టం. ఈ క్రమంలో ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడిపోయింది ఈ బ్యూటీ!