HomeTelugu Trendingఈ వారం చూడాల్సిన OTT releases జాబితా ఇదే..

ఈ వారం చూడాల్సిన OTT releases జాబితా ఇదే..

List of most awaited OTT releases this week
List of most awaited OTT releases this week

OTT releases this week:

ఈ వీకెండ్‌ OTT ప్లాట్‌ఫామ్‌లపై సినిమాల సందడి మామూలుగా లేదు! యాక్షన్, థ్రిల్లర్, డ్రామా అన్నీ కలిపి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్యాక్ రెడీగా ఉంది. మిర్చి మసాలా బలంగా ఉండే సినిమాలే కాదు, కథ, ఎమోషన్ ఉన్న సినిమాలు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి.

Netflixలో ‘Jewel Thief: The Heist Begins’ అనే హిందీ థ్రిల్లర్ రిలీజ్ అవుతోంది. సైఫ్ అలీ ఖాన్ మాస్టర్ థీఫ్ గా, జైదీప్ అహ్లావత్ తో పాటు మరో స్టైలిష్ క్రైమ్ డ్రామా ఇది. డబుల్ క్రాస్‌లు, ట్రిక్కీ మైండ్ గేమ్స్ చూస్తే థ్రిల్ గ్యారెంటీ.

‘Havoc’ లో టామ్ హార్డీ కనిపించనున్నాడు. జైలు బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుంది. డైరెక్టర్ గారెత్ ఎవాన్స్ స్టైల్ యాక్షన్ చూస్తే మెస్మరైజ్ అయిపోతారు.

JioHotstarలో ‘L2: Empuraan’ విడుదలైంది. మలయాళ స్టార్ మోహన్‌లాల్ స్టీఫెన్ నేడుంపల్లిగా మళ్ళీ వచ్చారు. రాజకీయ నేపథ్యం, పవర్ గేమ్స్, యాక్షన్ – ఒక ఫ్యాన్ కోసం అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి.

Amazon Prime Videoలో ‘Veera Dheera Sooran: Part 2’ స్ట్రీమింగ్ మొదలైంది. విక్రమ్ తన మాస్ అవతారంతో మళ్లీ దుమ్ము రేపాడు. అగడి పాత బంధాలు, హార్ట్ఫుల్ ఎమోషన్‌తో ఈ సినిమా నిలబడుతుంది.

ఇంకా ‘Étoile’ అనే డాన్స్ డ్రామా, ‘Andor Season 2’, ‘Bullet Train Explosion’ లాంటి ఇంటర్నేషనల్ కంటెంట్ కూడా స్ట్రీమింగ్ లో ఉన్నాయి. స్పోర్ట్స్ ఫ్యాన్స్ కోసం ‘Carlos Alcaraz: My Way’ డాక్యుమెంటరీ కూడా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu