
Rashmika Mandanna hit movies:
రష్మిక మందన్నా… ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా చర్చలో ఉంది. తన అందం, అభినయం, స్క్రీన్ ప్రెజెన్స్‌తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక తాజాగా అరుదైన ఘనత సాధించింది. ఆమె మూడు వరుస బ్లాక్‌బస్టర్ సినిమాలతో రూ. 500 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన ఏకైక భారతీయ నటి అయ్యింది.
500 కోట్ల క్లబ్‌లో రష్మిక హవా:
1. చావా
రష్మిక మన్నడన్నా నటించిన ‘చావా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచింది. మహారాణి యేసుబాయ్ పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫిబ్రవరి 14, 2025న విడుదలైన ఈ చిత్రం భారత్‌లో రూ. 520.55 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసును దోచుకుంది.
2. పుష్ప 2 – ది రూల్
2024లో విడుదలైన ‘పుష్ప 2’ సినిమా భారీ వసూళ్లతో చరిత్ర సృష్టించింది. హిందీలో రూ. 830 కోట్లకు పైగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్ల దాకా వసూలు చేసి ఇండియన్ సినిమా హిస్టరీలో మూడో పెద్ద హిట్‌గా నిలిచింది. ఇందులో రష్మిక శ్రీవల్లి పాత్రలో మరోసారి మెప్పించింది.
3. ఆనిమల్
రష్మిక నటించిన ‘ఆనిమల్’ సినిమా 2023లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం హిందీలో రూ. 505 కోట్లు, మొత్తం రూ. 556.36 కోట్ల వసూళ్లు రాబట్టింది.
ఈ ఘనత సాధించడానికి ముందు దీపికా పదుకొణేనే ఈ రికార్డు సాధించిన ఏకైక నటి. ఆమె నటించిన ‘జవాన్’ మరియు ‘పఠాన్’ సినిమాలు రూ. 500 కోట్ల క్లబ్‌లో నిలిచాయి. అయితే ఇప్పుడు రష్మిక ఈ రికార్డును అధిగమించింది.
రష్మిక త్వరలో సల్మాన్ ఖాన్ సరసన ‘సికందర్’లో కనిపించనుంది. అదనంగా ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘థామా’, ‘కుబేరా’ చిత్రాల్లోనూ నటిస్తోంది.