‘లక్కున్నోడు’ ప్రారంభం!

విష్ణు మంచు హీరోగా, బబ్లీ బ్యూటీ హన్సిక హీరోయిన్ గా ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు రాజ్ కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా ‘లక్కున్నోడు’. చిత్రం ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు దేవుని పటాలపై క్లాప్ కొట్టారు. స్క్రిప్ట్ ను దర్శకుడికి అందించి, యూనిట్ సభ్యులను అభినందించారు. నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని గణతంత్ర్యదినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా .. చిత్ర నిర్మాత ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ.. ”లవ్ అండ్ కామెడి ఎంటర్ టైనర్ గా రూపొందనున్న మా లక్కున్నోడు చిత్రం మంచు మోహన్ బాబుగారి చేతుల మీదుగా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ఆయన మా టీంకు ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. గీతాంజలి, త్రిపుర వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను డైరెక్ట్ చేసిన రాజ్‌కిర‌ణ్‌ ఈసారి వాటికి భిన్నంగా లవ్ అండ్ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్ గా లక్కున్నోడు చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలను డైమండ్ రత్నబాబు అందిస్తున్నారు. ఈరోజు నుండే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి సక్సెస్ చిత్రాల తర్వాత విష్ణు, హన్సికల కాంబినేషన్ లో రానున్న హ్యాట్రిక్ మూవీ ఈ లక్కున్నోడు. ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.
 
CLICK HERE!! For the aha Latest Updates