నూతన దంపతుల ఆనంద కోలాహలం.. ఫొటోలు, వీడియోలు వైరల్‌

నూతన దంపతులు దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న ‘దీప్‌వీర్‌’ నవంబరు 14న ఇటలీలోని లేక్‌ కోమోలో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. కొంకణీ, సింధీ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహ వేడుక రెండుసార్లు జరిగింది. నవంబరు 18న తిరిగి ముంబయి వచ్చిన ‘దీప్‌వీర్‌’ నవంబరు 21న బెంగళూరులో స్నేహితులు, బంధువుల కోసం రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. పెళ్లి వేడుకల సందర్భంగా ఈ జంట సంప్రదాయ దుస్తుల్లో సందడి చేసింది. తన ప్రత్యేక వస్త్రధారణతో స్టైల్‌ ఐకాన్‌గా పేరుపొందిన రణ్‌వీర్‌ కూడా వేడుకలకు తగ్గ దుస్తుల్లోనే కనిపించారు.

కాగా తాజాగా దీపిక సోదరి రితిక తన అక్కాబావల కోసం ముంబయిలో ఘనంగా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ‘దీప్‌వీర్‌’ ఆనందంతో చిందేశారు. రణ్‌వీర్‌ పెళ్లికి ముందు రోజుల్లో కనిపించే విధంగా విభిన్నమైన దుస్తుల్లో సందడి చేశారు. మనీష్‌ అరోరా డిజైన్‌ చేసిన నలుపు, గులాబి రంగు కలగలిపిన కుర్తాలో ప్రత్యేకంగా కనిపించారు. దీపిక మల్టీకలర్‌ గాగ్రా ఛోలీలో ఆకట్టుకున్నారు. ఈ పార్టీలో తీసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘నా స్నేహితుడు, ఉత్తమ నటుడు పెళ్లి పార్టీకి దుస్తులు తయారు చేయమన్నారు. ఇదిగో వాటిని ఇలా డిజైన్‌ చేశా. శుభాకాంక్షలు రణ్‌వీర్‌ సింగ్‌. నీకు దుస్తులు డిజైన్‌ చేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుంది’ అని మనీష్‌ అరోరా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. నవంబరు 28న, డిసెంబరు 1న ‘దీప్‌వీర్‌’ ముంబయిలో పెళ్లి విందు ఏర్పాటు చేయనున్నారు.

View this post on Instagram

– Ranveer Singh at his wedding party that is hosted by his sister Ritika in Mumbai 💗 – Look at him dancing his heart out 😍💗 can u spot deepika? ➖‬ رانفير سينغ في حفلة المقامه من قبل اخته ريتيكا بمناسبة زفافة 💗 – ياعمري شوفوه احس قاع يطلع الكبت كله من عقب ما كان متأدب الجم يوم الي راحوا 😂💗 المهم الي لابسه ابيض شكلها ديبيكا تقدرون تلمحونها لمن رانفير يرقص ونهاية الفيديو 💗 ___________________ ⁦‪#RanveerSingh‬⁩ ‎⁧‫#رانفير_سينغ‬ #deepikapadukone #deepveerkishaadi #deepikawedsranveer #deepveer

A post shared by Ranveer singh FC ♥️ (@ranveersinghtbt) on