HomeTelugu Trending'మా' ఎన్నికల డేట్‌ ఫిక్స్‌

‘మా’ ఎన్నికల డేట్‌ ఫిక్స్‌

MAA elections will conduct

మూవీ అర్టిస్టు అసోసియేషన్‌(మా) ఎన్నికలు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. దీంతో ఎన్నికల తేదీ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్‌ డేట్‌ని ఫిక్స్‌ చేస్తూ తాజాగా ‘మా’ క్రమ శిక్షణ కమిటీ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్‌ 10న ‘మా’ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటనలో వెల్లడించింది. దీంతో అధ్యక్ష బరిలో నిలిచిన అభ్యర్థులు, వారి ప్యానెల్‌ సభ్యులు ప్రచారం ముమ్మరం చేయనున్నారు. చివరి వరకూ ఎవరు పొటీలో ఉంటారు? ఎవరు విజయం సాధిస్తారు? అన్నదానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అధ్యక్ష బరిలో ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు, సీవీఎల్‌ నరసింహారావు, హేమలు ఉన్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu