HomeTelugu Trendingపుష్ప: సమంత ఐటమ్‌ సాంగ్‌పై మాధవిలత షాకింగ్‌ కామెంట్స్‌

పుష్ప: సమంత ఐటమ్‌ సాంగ్‌పై మాధవిలత షాకింగ్‌ కామెంట్స్‌

Madhavi latha shocking comm
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’. ఈ సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్‌ చేసిన సంగతి తెలసిందే. ఈ పాటకు మంచి స్పందన వస్తుందో అంతే రేంజ్‌లో వివాదాలు అలుముకుంటున్నాయి. ఊ ఉంటావా మామ.. ఊఊ అంటావా అంటు సాగే ఈ పాట ఓ వైపు వ్యూస్‌ పరంగా దూసుకుపోతూ యూట్యూబ్‌లో రికార్డు సృష్టిస్తోంది. మరో వైపు మగవారి మనభోవాలను దెబ్బతీశారంటూ ఈ పాటపై ఏపీ పురుషుల సంఘం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

మగవాళ్లంతా చెడ్డావారిగా చూపించే అర్థం వచ్చేలా ఈ పాట ఉందని, వెంటనే దీనిని తొలగించాలంటూ డిమాండ్‌ చేశారు. అంతేగాక పుష్ప టీంతో పాటు సమంతపై కూడా కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో సమంత స్పెషల్‌ సాంగ్‌పై పురుషుల సంఘం పెట్టిన కేసుపై మాధవిలత స్పందిస్తూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఫేస్‌బుక్‌ వేదికగా ఆమె ఓ పోస్ట్‌ షేర్‌ చేస్తూ మహిళల పరువు పోయిందంటూ అసహనం వ్యక్తం చేసింది. ‘వాయమ్మో పుష్ప మూవీ సాంగ్ మీద కేసు అంటగా. ఈ లెక్కన ఇండస్ట్రీలో 98 శాతం పాటలు అలానే ఉంటాయి. సాంగ్స్ లేని మూవీ చెయ్యాలి.

నేను కూడా అమ్మాయిల మీద రాసే పాటలకి కేసులు పెడతా. పుష్పలో రారా సామీ సాంగ్ మీద కేసు వేస్తా. ఏంటీ ఒక అమ్మాయికి మగాడిని చూస్తే.. అతను పిలిస్తే అంత చులకనగా వెంటపడి వెళ్లిపోద్దా? అబ్బాయి నడిచినచోట భూమిని మొక్కుతుందా? ఒక మహిళ పరువు పోయింది. ఛ నాకు నచ్చలే. నేనూ కేసు పెడతా. అంతే తగ్గేదేలే’ అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో సమంత స్పెషల్‌ సాంగ్‌ను వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో మాధవిలత పెట్టిన ఈ పోస్ట్‌ హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై పలువురు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!