HomeTelugu Trendingమహాసముద్రం సెన్సార్‌ పూర్తి

మహాసముద్రం సెన్సార్‌ పూర్తి

Maha Samudram movie censor
అజయ్ భూపతి తాజా చిత్రం ‘మహాసముద్రం’. ఈ సినిమాలో శర్వానంద్ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ .. సిద్ధార్థ్ సరసన అదితీ రావు అలరించనున్నారు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికెట్ ను సంపాదించుకుంది.

ఇక ఈ సినిమాలో జగపతిబాబు .. రావు రమేశ్ .. ‘గరుడ’ రామ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూడు పాత్రలను అజయ్ భూపతి చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశాడట. అందువలన ఈ పాత్రలు మూడు కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. దసరా బరిలో ఈ సినిమా ఏ రేంజ్ లో సందడి చేస్తుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu