‘మహాభారత్‌’ ఇంద్రుడు సతీష్ కౌల్ ఇక లేరు

మహాభారత్ టీవీ సీరియల్‌లో ఇంద్రుడు పాత్ర పోషించిన సతీశ్ కౌల్(73) కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. ప్రముఖ దర్శక నిర్మాత బీఆర్ చోప్రా నిర్మించిన ఈ సీరియల్ ఎంతో ఆదరణ పొందింది. అందులో ఇంద్రుడి పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న సతీష్ దాదాపు 300 పంజాబీ, హిందీ చిత్రాల్లో నటించారు. చివరి వరకూ నటించాలనే ఆయన తపన పడేవారు. చివర్లో సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో ముంబై నుంచి పంజాబ్‌కు వెళ్లిపోయారు. 2011లో అక్కడ యాక్టింగ్ స్కూల్ ఏర్పాటు చేశారు. గతేడాది కరోనా బారిన పడ్డ సతీష్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో మళ్లీ కరోనా బారినపడి చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు.

CLICK HERE!! For the aha Latest Updates