HomeTelugu Newsసుధీర్‌బాబు లేటెస్ట్ మూవీ ప్రారంభం

సుధీర్‌బాబు లేటెస్ట్ మూవీ ప్రారంభం

Sudheer Babu movie
సుధీర్‌బాబు తాజా చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రెండేళ్ల క్రితం వచ్చిన సమ్మోహనం చిత్రం విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత నానితో కలిసి వీ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. మరోసారి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సుధీర్ బాబు సరసన కృతిశెట్టి హీరోయిన్. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్‌పై మహేంద్రబాబు, కిరణ్ నిర్మిస్తున్నారు. ముహూర్తం షాట్‌కు ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ క్లాప్ కొట్టారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu