‘యన్‌టిఆర్: మహానాయకుడు’ ప్రోమో..

నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కుతున్న ‘యన్‌టిఆర్: మహానాయకుడు’ సినిమాకు సంబంధించిన ఓ ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. ‘నా ప్రాణాలకు ప్రాణంగా.. నా బిడ్డలకు తల్లిగా.. నా సహధర్మచారిణిగా.. నీ అనుమతి కావాలి తారకం..ఇష్టమేనా?’ అంటూ బాలకృష్ణ(ఎన్టీఆర్‌).. విద్యాబాలన్‌ (బసవతారకం)తో చెబుతున్న డైలాగ్‌తో ప్రోమో మొదలైంది. ఇందుకు విద్యాబాలన్‌ సమాధానంగా.. ‘నీకూ నాకూ రెండు ఇష్టాలుంటాయా బావా..’ అని చెప్పడం హైలైట్‌గా నిలిచింది.

క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్‌బీకే ఫిలింస్‌ బ్యానర్‌పై బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. మీ ఇంటింటి గడపకి పసుపునై బతకడానికి వచ్చాను’ అంటూ ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ‘యన్‌టిఆర్‌’ బయోపిక్‌కు సంబంధించిన రెండో భాగంగా ఈ సినిమాను తెరకెక్కించారు. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

CLICK HERE!! For the aha Latest Updates