HomeTelugu Big Storiesరివ్యూ: మహానుభావుడు

రివ్యూ: మహానుభావుడు

నటీనటులు: శర్వానంద్, మెహ్రీన్, వెన్నెల కిషోర్, నాజర్ తదితరులు
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరావు
నిర్మాతలు: వంశీ, ప్రమోద్
దర్శకత్వం: మారుతి
పెద్ద హీరోలతో పోటీ పడుతూ మరి తన సినిమాలను విడుదల చేస్తుంటాడు శర్వానంద్. ఈ క్రమంలో వచ్చిన సినిమాలతో హిట్స్ కూడా అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో పోటీ పడుతూ తను నటించిన ‘మహానుభావుడు’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మరి సినిమా ఎలా ఉందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ:
ఆనంద్(శర్వానంద్) సాఫ్ట్ వేర్ కంపనీలో పని చేస్తుంటాడు. అతడికి ఓసిడి (అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్)అనే వ్యాధి ఉంటుంది. ఈ లక్షణాలు గల వారికి అతి శుభ్రత ఎక్కువగా ఉంటుంది. తమతో పాటు చుట్టూ ఉండేవాళ్లు కూడా క్లీన్ గా ఉండాలని అనుకుంటారు. అలాంటి లక్షణాలు గల ఆనంద్.. మేఘన(మెహ్రీన్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. మేఘన కూడా ఆనంద్ ను ప్రేమిస్తుంది. అయితే ఆనంద్ కు ఉన్న లక్షణాల కారణంగా ఎదురయిన కొన్ని క్లిష్ట పరిస్థితుల
కారణంగా మేఘన అతడికి బ్రేకప్ చెబుతుంది. అలా ఒడీసీ వలన ప్రేమను కోల్పోయిన ఆనంద్ కు తిరిగి తన ప్రేమ దక్కుతుందా..? తన ప్రేమను గెలిపించుకోవడం కోసం ఆనంద్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు..? అనే విషయాలతో సినిమా నడుస్తుంది.

విశ్లేషణ: 

గతంలో ‘భలే భలే మగాడివోయ్ సినిమాలో మతిమరుపు వాడు ప్రేమిస్తే ఎలా ఉంటుందనే కొత్త పాయింట్ తో సినిమా చేసిన దర్శకుడు మారుతి ఈసారి అతి శుభ్రత గల వ్యక్తి ప్రేమిస్తే ఏం జరుగుతుందనే కాన్సెప్ట్ ను తెరపై ఆవిష్కరించారు. ఈ కథకు కామెడీ ఎక్కువ శాతం జోడించి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడంలో దర్శకుడిగా విజయాన్ని అందుకున్నాడు. ఓడీసీ లక్షణాలు గల వారు ఎలా ప్రవర్తిస్తారనే విషయాలను తెరపై బాగా చూపించారు. సినిమా మొదటి భాగంగా
కాస్త నెమ్మదిగా నడిచినా.. సెకండ్ హాఫ్ లో మాత్రం జోరు చూపించింది. కేవలం కామెడీను నమ్ముకోకుండా.. ఎమోషన్స్ ను కూడా బాగా పండించారు. క్లైమాక్స్ సన్నివేశాలు కాస్త రొటీన్ గా అనిపిస్తాయి. హీరోయిన్ కోసం హీరో మారే సన్నివేశాలు ఇంకాస్త బలంగా ఉండే బాగుండేది.
లవ్ ట్రాక్ రొటీన్ గా ఉన్నప్పటికీ ఎక్కగా బోర్ కొట్టలేదు. సినిమా మొదటి నుండి ఎక్కడా బోర్ అని అనిపించకుండా ఎంటర్టైనింగ్ గా కథను నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కథ మొత్తం శర్వా పాత్ర చుట్టూనే తిరుగుతుంటుంది. అతడి చిరాకు పడే ప్రతి సంధర్భంలో ఆడియన్స్ కు నవ్వొస్తుంది. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు శర్వానంద్. తన డ్రెస్సింగ్, లుక్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఆ పాత్ర తనకోసమే పుట్టినట్లుగా ఉంటుంది. మెహ్రీన్ తెరపై చాలా అందంగా కనిపించడంతో పాటు బాగానే నటించింది. వెన్నెల కిషోర్ తన కామెడీతో నవ్విస్తాడు. భద్రం క్యారెక్టర్ కూడా ఆడియన్స్ ను నవ్విస్తుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు.

సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంటుంది. సినిమా చాలా కలర్ ఫుల్ గా ఉంది. టైటిల్ సాంగ్ తప్ప మిగిలిన పాటలు చెప్పుకునే విధంగా లేవు. నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు గొప్ప స్థాయిలో ఉన్నాయి. మొత్తానికి ‘మహానుభావుడు’గా శర్వా మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
రేటింగ్: 3/5

Recent Articles English

Gallery

Recent Articles Telugu