‘అర్జున్ రెడ్డి’ గా విక్రమ్ తనయుడు!

తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న నటుడు విక్రమ్ తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. కమర్షియల్ సినిమాలు కాకుండా.. విభిన్న కథలతో కూడిన చిత్రాల్లో నటించడం విక్రమ్ స్టయిల్. ఇప్పుడు తన తనయుడు కొడుకు ధృవ్ ని కూడా హీరోగా పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నాడు. తన కొడుకు ఎంట్రీ గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. కొత్తదనంతో కూడిన కథ, నటనకు ప్రాధాన్యత ఉండే పాత్ర కోసం ఆయన ఎదురుచూస్తున్నాడు.
ఇప్పుడు విక్రమ్ దృష్టి ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై పడింది.

తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా అతడికి మంచి పేరును తెచ్చిపెట్టింది. యూత్ ను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. వసూళ్ల పరంగా కూడా నిర్మాతలకు లాభాలను మిగిల్చింది. ఈ సినిమా తమిళ రీమేక్ తో ధృవ్ ను లాంచ్ చేయాలని విక్రమ్ భావిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది!