3రోజుల్లో 10కోట్ల షేర్!

శర్వానంద్ మ్యాజిక్ మ‌రోసారి బాక్సాఫీస్ వ‌ద్ద వ‌ర్కవుటైంది. తొలి వీకెండ్ అసాధార‌ణ వ‌సూళ్లు ద‌క్కాయ‌నే చెప్పాలి. శ‌త‌మానం భ‌వ‌తి త‌ర్వాత శ‌ర్వాకి మ‌రో బంప‌ర్ హిట్ ద‌క్కిన‌ట్టేన‌న్న‌ది పంపిణీదారుల విశ్లేష‌ణ‌. కేవ‌లం మూడూ మూడు రోజుల్లో 10 కోట్ల షేర్ వ‌సూలు చేసిందంటే .. ఆ మేర‌కు శ‌ర్వా మ్యాజిక్ ప‌ని చేసిన‌ట్టేన‌ని చెబుతున్నారు. రిలీజ్ వేళ పాజిటివ్ టాక్ ఈ సినిమాకి అస్సెట్ అయింద‌ని విశ్లేషిస్తున్నారు. 
 
ఏరియాల వారీ 3 రోజుల షేర్ వ‌సూళ్ల‌ను విశ్లేషిస్తే, నైజాం 2. 33 కోట్లు, ఉత్తరాంధ్ర 1. 18, సీడెడ్ 1. 05 , గుంటూరు 85లక్షలు , తూర్పు గోదావరి 81 ల‌క్ష‌లు, కృష్ణా 69 ల‌క్ష‌లు, ప‌శ్చిమ‌ గోదావరి 50 ల‌క్ష‌లు, నెల్లూరు 24 ల‌క్ష‌లు వ‌సూలైంది. మొత్తం ఏపీ-నైజాం క‌ల‌పుకుని  7. 85 కోట్లు వ‌సూలైంది. అమెరికా 1. 32 కోట్లు, కర్ణాటక 97 లక్షలు, ఇతర ఏరియాలు 30 లక్షలు.. ఈ మొత్తం క‌లుపుకుంటే.. 10 కోట్ల 30 లక్షల షేర్ వ‌సూలైంద‌ని ట్రేడ్ చెబుతోంది.