కొత్త ట్రెండ్‌ సెట్‌ చేసిన ‘మహర్షి’ టీజర్‌

‘సక్సెస్‌లో ఫుల్‌స్టాఫ్‌లు ఉండవు. కామాలు మాత్రమే ఉంటాయి’ అని మహేశ్‌ బాబు అన్నట్లు.. ‘మహర్షి’ సినిమా టీజర్‌ రికార్డులకు కూడా ఫుల్‌స్టాప్‌లు లేవు.. కేవలం కామాలు మాత్రమే.. ఈ టీజర్‌ కొత్త ట్రెండ్‌ సెట్‌ చేసి.. యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. అతి తక్కువ సమయంలోనే అత్యధిక మంది రీట్వీట్‌ చేసిన, లైక్‌ చేసిన టీజర్‌గా నిలిచింది. అంతేకాదు టాలీవుడ్‌లో వేగంగా 10 మిలియన్ల వ్యూస్‌ నుంచి 12 మిలియన్ల వ్యూస్‌కు చేరిన టీజర్‌గానూ రికార్డు సృష్టించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో కేవలం ఒక్కరోజులో అత్యధిక మంది చూసిన టీజర్‌గా ఘనత సాధించింది. ఈ టీజర్‌ను మొత్తం 12 మిలియన్ల మందికిపైగా వీక్షించడం విశేషం.

‘మహర్షి’ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు, అశ్వినీ దత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. మహేశ్‌ స్నేహితుడి పాత్రలో అల్లరి నరేష్‌ నటిస్తున్నారు. మీనాక్షి దీక్షిత్‌, సోనాల్‌ చౌహాన్‌, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌, పోసాని, రావు రమేశ్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates