‘మహర్షి’ టీజర్‌ డేట్‌ ఫిక్స్‌

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అభిమానులకు ఈ శనివారం రెండు పండగలని చెప్పాలి. ఒకటి ఉగాది. మరొకటి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘మహర్షి’ టీజర్‌ విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి ట్విటర్ వేదికగా ప్రకటించారు. ‘ఏప్రిల్‌ 6న ఉదయం 9.09 గంటలకు ‘మహర్షి’ టీజర్‌ రాబోతోంది. సూపర్‌స్టార్‌తో కలిసి ఈ ప్రయాణంలో పాల్గొనండి’ అని పేర్కొంటూ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు. సినిమాలో మహేశ్‌ రిషి పాత్రలో నటిస్తున్నారు. టీజర్‌లో రిషికి సంబంధించిన అంశాలను మాత్రమే చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అల్లరి నరేశ్‌, హీరోయిన్‌ పూజా హెగ్డే పాత్రలకు సంబంధించిన టీజర్లను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సినిమాకు సంగీతం అందించారు. మే 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.