HomeTelugu Trending70 ఏళ్ల చరిత్ర ఉన్న చీర గురించి Pooja Hegde ఏం అంటోందంటే..

70 ఏళ్ల చరిత్ర ఉన్న చీర గురించి Pooja Hegde ఏం అంటోందంటే..

Pooja Hegde Stuns in 70-Year-Old Saree!
Pooja Hegde Stuns in 70-Year-Old Saree!

Pooja Hegde Vintage Saree:

సౌత్ బ్యూటీ పూజా హెగ్డే తాజాగా తన వింటేజ్ వార్డ్‌రోబ్ నుంచి ఓ ప్రత్యేకమైన వస్త్రాన్ని ఎంచుకుంది. ‘దేవ’ హీరోయిన్ 70 ఏళ్ల పాత కాంచివరం చీర కట్టుకొని ఫోటోలు షేర్ చేస్తూ అందర్నీ ఫిదా చేసింది. ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ చీరకు నీలం కలర్ బోర్డర్ ఉండగా, అదే బోర్డర్‌తో మ్యాచ్ అయ్యే బ్లౌజ్ వేసుకుంది.

దీనికి గోల్డ్ నెక్లెస్, కంప్లీమెంటరీ ఈరింగ్స్, గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకొని పూజా సదరు లుక్‌ని మరింత ప్రత్యేకంగా మార్చుకుంది. మధ్యలో భాగం విడదీసి ఓపెన్ హేర్ స్టైల్‌తో గజ్రా వేసుకుని పక్కా సౌత్ లుక్‌ను సెట్ చేసింది.

ఈ చీర కట్టుకోగానే తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చినట్లు పూజా చెప్పింది. తన అజ్జి (అమ్మమ్మ) కాంచివరం చీరలు కట్టుకుని తిరిగిన దృశ్యాలు, పెళ్లిళ్లకు రెడీ అవుతూ ఇంటిలో పరచిన మల్లిగె సువాసన, మొదటి వర్షాల తర్వాత మంగళూరు మట్టి నుండి వచ్చే మధురమైన వాసన అన్నీ గుర్తొచ్చాయని చెప్పింది. “సింపుల్ విషయాల్లో ఎంత అందం ఉంటుంది. కాలచక్రం గమనంలో అందమైన జ్ఞాపకాలు కనిపిస్తాయి” అంటూ భావోద్వేగంగా షేర్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

వర్క్ వైజ్ చూస్తే, పూజా హెగ్డే తమిళ రొమాంటిక్ ఎంటర్టైనర్ “రెట్రో”లో హీరో సూర్యకి జోడీగా నటిస్తోంది. ఈ మూవీ నుంచి రిలీజైన “కనిమా” సాంగ్ కు మ్యూజిక్ లవర్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

“నా సోషల్ మీడియా కనిమా హుక్‌స్టెప్ రీమేక్స్‌తో నిండిపోయింది. అందరి నుండి వచ్చే ప్రేమకి నేను ఎంతో ఆనందిస్తున్నా. ప్రతి ఒక్కరు స్టెప్పులు వేస్తుండటం ఓ ఆర్టిస్ట్‌గా నాకు దక్కిన గొప్ప గౌరవం,” అని పూజా చెప్పారు.

“రెట్రో సినిమాను థియేటర్స్‌లో చూడాలని ఎదురు చూస్తున్నా. థియేటర్స్‌లో మీతో కలుసుకునే రోజు కోసం వేచి చూస్తున్నా,” అంటూ తన ఆనందాన్ని పంచుకుంది.

ALSO READ: Chiranjeevi next movie కోసం నయనతార అంత రెమ్యునరేషన్ అడిగిందా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu