భారీ బడ్జెట్‌తో మహేష్, సుకుమార్‌ల మూవీ..!

టాలీవుడ్‌ సుపర్‌ స్టార్‌ మహేష్ తన 25 సినిమా మహర్షి షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, సి అశ్వినీదత్, పివిపి సినిమాలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహేష్ తో పాటు ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్నారు. చాలాకాలం తరువాత మహేష్ ఈ మూవీలో కాలేజీ స్టూడెంట్ గా కనిపిస్తుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన మహర్షి ఫస్ట్ లుక్ టీజర్ ఆకట్టుకుంది. కాగా ఈ చిత్రంలో మహేష్‌ బాబు గెడ్డం లుక్‌తో కనిపించనున్నాడు.

మహేష్ బాబు 26వ చిత్రం అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్‌ 26 వ సినిమా కోసం రూ.150 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నట్టు తెలుస్తుంది. కాగా మహేష్ తన 26 వ సినిమాను రంగస్థలం దర్శకుడు సుకుమార్ తో కమిటైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నది. మహర్షి రిలీజ్ తరువాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తున్నది.