HomeTelugu Trendingనా బర్త్‌డేకి ఆ పని చేయండి: మహేష్‌ బాబు

నా బర్త్‌డేకి ఆ పని చేయండి: మహేష్‌ బాబు

Mahesh Babu birthday specia

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఆగస్టు 9న పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అయతే మహేష్‌ ఫ్యాన్స్‌ ఆయన బర్త్‌డేని ఏ రెంజ్‌లో సెలబ్రెట్‌ చేస్తారో తెలిసిందే. అయితే ఈ సారి మహేష్‌ తన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు ఓ విజ్ఞప్తి చేస్తున్నాడు. తన పుట్టిన రోజున ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని కోరుతున్నాడు.

“నాపై ప్రేమాభిమానాలతో మీరు చేసే పనులు నన్నెంతగానో ప్రేరేపిస్తున్నాయి. అయితే ఈసారి మీ అందరికీ నాదో ప్రత్యేక విన్నపం. నా బర్త్‌డే రోజు ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌కు మద్దతుగా నిలబడండి. మొక్కలు నాటుతూ దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి నన్ను ట్యాగ్‌ చేయండి. వాటిని నేను కూడా చూస్తాను” అని పేర్కొన్నాడు. మహేశ్‌ తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. దీంతో మహేష్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!