తెలుగు హీరోల్లో మహేష్ క్రేజ్!

అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మహేష్ బాబుకి అభిమానులు ఉన్నారు. దక్షిణాది హీరోల్లో మహేష్ కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా టైమ్స్ గ్రూప్ మోస్ట్ డిజైరబుల్ మెన్స్ లిస్ట్ ను విడుదల చేసింది. ఈ సర్వేలో ఎక్కువ ప్రజాదరణ పొందిన తెలుగు సినిమా హీరోల జాబితాలో మహేష్ బాబు టాప్ ప్లేస్ లో నిలిచారు. గతేడాది మిస్టర్ వరల్డ్ గా నిలిచిన రోహిత్ ఖండెల్వాకి ఈ పోల్ లో దేశవ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల ప్రజలు అగ్రస్థానాన్ని కట్టబెట్టారు. దేశవ్యాప్త సర్వేలో రోహిత్ తరువాత విరాట్ కోహ్లి, హృతిక్ రోషన్, రణవీర్ సింగ్, పవాద్ ఖాన్, సిద్ధార్థ్ మల్హోత్రా నిలవగా ఏడవ స్థానంలో మహేష్ నిలిచాడు. 
అయితే గతేడాది మహేష్ ఆరవ స్థానాన్ని దక్కించుకోగా.. ఈ ఏడాది ఒక స్థానాన్ని చేజార్చుకున్నారు. తెలుగు ప్రజల ఆదరణలో మాత్రం మహేష్ రెండో స్థానాన్ని దక్కించుకోగా.. అతడి తరువాత హీరో నాని, రానా, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోలు నిలిచారు. పవన్ కల్యాణ్ మాత్రం 11వ స్థానానికి పడిపోయారు.