HomeTelugu Trendingమహేష్‌, దుల్కర్‌ సల్మాన్‌తో నయన్‌

మహేష్‌, దుల్కర్‌ సల్మాన్‌తో నయన్‌

4 5సౌత్ లో టాప్ హీరోయిన్‌గా నయనతార చలామణి అవుతున్నది. శ్రీరామరాజ్యం తరువాత సినిమాలకు దూరంగా ఉండాలని అనుకుంది. కానీ, అనుకున్నట్టుగా ప్రభుదేవాతో వివాహం విఫలం కావడంతో తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్ ఆమెకు బాగా కలిసి వచ్చింది. టాప్ హీరోయిన్ గా ఎదిగేందుకు అన్ని రకాలుగా ఉపయోగపడింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. మరోవైపు స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ బిజీ అయ్యింది.

రజినీకాంత్ దర్బార్, ఇళయ తలపతి విజయ్ బిగిల్ సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుండగా, మెగాస్టార్ తో చేసిన సైరా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రమోషన్స్ కు దూరంగా ఉండే నయనతార.. వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీకి ఫోజులు ఇచ్చింది. సౌత్ సౌత్ పేరుతో అక్టోబర్ లో రిలీజ్ చేసిన మ్యాగజైన్ కవర్ పీజీపై మహేష్, దుల్కర్ సల్మాన్ తో కలిసి నయన్ ఫోజులు ఇవ్వడం విశేషం. అక్టోబర్ మ్యాగజైన్ కవర్ పీజీ అద్భుతంగా ఉండటంతో సౌత్ లో ఈ మ్యాగజైన్ సేల్స్ భారీ స్థాయిలో ఉన్నాయని సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!