HomeTelugu Trendingస్టైలిస్ట్‌కు కరోనా.. ఐసోలేషన్‌లో మహేష్‌ బాబు!

స్టైలిస్ట్‌కు కరోనా.. ఐసోలేషన్‌లో మహేష్‌ బాబు!

Mahesh babu in self isolat
టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సెట్లో మహేష్ బాబు పర్సనల్ స్టైలిస్ట్ కు కరోనా సోకింది. దీంతో డాక్టర్ల సలహా మేరకు మహేష్ బాబు ఐసోలేషన్ లో ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. సన్నిహిత వర్గాల సమాచారం మేరకు గత వారం ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ బాబు వ్యక్తిగత స్టైలిస్ట్ కు కరోనా సోకిందట. అతనితో పాటు చిత్రబృందంలోని నలుగురికి ఒకేసారి కరోనా సోకిందట. దీంతో ముందు జాగ్రత్త చర్యగా.. సినిమా షూటింగ్ ను వాయిదా వేశారు మేకర్స్. ప్రస్తుతం మహేష్ బాబు ఇంట్లోనే ఐసోలేషన్ ఉన్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!