బాలీవుడ్‌లో మహేష్‌ బాబు మల్టీస్టారర్‌..!


టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు.. బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడట. అది కూడా మామూలుగా కాదు.. బాలీవుడ్‌లో యంగ్‌ హీరో రణ్‌వీర్‌‌ సింగ్‌తో కలిసి మల్టీస్టారర్‌లో మహేష్‌ బాబు నటించబోతున్నట్లు.. సమాచారం. ప్రస్తుతం మహేష్‌, రణ్‌వీర్‌‌ ముంబైలో ఓ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ షూట్‌ ముగిసిన వెంటనే ప్రముఖ ప్రొడ్యూసర్‌‌ సాజిద్‌ నడియావాలా నిర్మించే సినిమాకు సైన్‌ చేయబోతున్నారని తెలుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోలతో కలిసి హిందీలో ఓ ఫీచర్ ఫిల్మ్ తీయాలని సాజిద్ చాన్నాళ్ల నుంచి ప్లాన్‌ చేస్తున్నాడట. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకవేళ మహేష్‌, రణ్‌వీర్‌‌ కలిస్తే ఓ క్రేజీ కాంబో కానుంది. ఎందుకంటే ఈ ఇద్దరూ భిన్న మనస్తత్వం కలవారు. మన టాలీవుడ్ సూపర్ స్టార్ చాలా నిదానంగా, రిజర్వ్‌డ్‌గా ఉంటే దానికి పూర్తి భిన్నంగా రణ్‌వీర్‌‌ తెగ అల్లరి చేస్తూ అందరితో ఇట్టే కలిసిపోతాడు. యాడ్ ఫిల్మ్ షూటింగ్‌లో ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరిందట. మరి, ఈ ఇద్దరూ వెండితెరను పంచుకుంటారో లేదో చూడాలి.