మహేష్‌ లుక్‌కు నెటిజన్లు ఫిదా.. ఏంది సామీ ఆ లుక్.. మీ వయసు ఎంత?

టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌బాబు ప్రస్తుతం తన కుటుంబంతో జర్మనీలో విహారయాత్రకు చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ బస చేసిన హోటల్‌ దగ్గర తీసిన ఫొటోలను నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అక్కడి ప్రదేశం పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉందని అన్నారు. తమ హోటల్‌కు బయట ఆరు కిలోమీటర్ల విస్తీర్ణంలో 2,500 రకాలకు పైగా మొక్కలు ఉన్నాయని తెలిపారు. తన సోదరుడి కుటుంబాన్ని కలిశానని ఆమె పేర్కొన్నారు.

ఈ ఫొటోల్లో మహేష్‌ లుక్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ‘మహేశ్‌ ఎంత బాగున్నావ్‌, ఆయన‌ నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నా, ఏం ఉన్నాడ్రా బాబూ, అన్నకి వయసు తగ్గిపోతోంది, ఆయనకు వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమే, ఏంది సామీ ఆ లుక్‌, సర్‌ మీ వయసు ఎంత?’.. అంటూ తెగ కామెంట్లు చేశారు. ఈ ట్రిప్‌లో నమ్రత, గౌతమ్‌, సితార కలిసి దిగిన ఫొటోను మహేష్‌ ఇన్‌స్టాగ్రామ్‌‌లో షేర్‌ చేశారు. ‘కుటుంబానికే నా మొదటి ప్రాధాన్యం’ అని పేర్కొన్నారు. అక్టోబర్‌ మూడో వారం నుంచి ఇదే లుక్‌లో అమెరికాలో జరగనున్న షూటింగ్‌లో పాల్గొననున్నాడు మహేష్. ఈ సినిమాలో యంగ్ హీరో అల్లరి నరేష్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.