గడ్డంతో మహేష్ ను చూసారా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘సంభవామి’ అనే టైటిల్ ను పెడుతున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళినప్పటినుండి
ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఒక్క డీటైల్ కూడా బయటకు రావడం లేదు. మహేష్ లుక్ కూడా ఇప్పటివరకు రివీల్ చేయలేదు. అంతా.. సస్పెన్స్ గా మైంటెన్ చేస్తూ.. ప్రేక్షకులకు ఒకేసారి ట్రీట్ ఇవ్వాలనేది మురుగదాస్ ప్లాన్.

సినిమాలో ఒక్క స్టిల్ కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడుతోంది చిత్రబృందం. అయితే తాజాగా మహేష్ ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. గడ్డంతో ఉన్న మహేష్ బాబు ఇప్పటివరకు ఇలాంటి లుక్ లో కనిపించలేదు. అసలు ఇది మహేషేనా.. అన్నట్లుగా ఉన్నాడు. సినిమాలో మహేష్ గెటప్పులో ఇదొకటి అంటూ ఇప్పుడు ఈ ఫోటో హల్ చల్ చేస్తోంది. సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. వేసవి కానుకగా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.