మహేష్‌ నెక్ట్స్‌ మూవీలో బాలీవుడ్ హీరోయిన్‌..!

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ప్రస్తుతం తన 25 వ సినిమా మహర్షి బిజీలో ఉన్నాడు. ప్రస్తుతానికి షూటింగ్ కు రెస్ట్ ఇచ్చిన యూనిట్ సంక్రాంతి తరువాత షూటింగ్ స్పీడ్ పెంచుతుంది. ఈనెలాఖరుకు లేదంటే ఫిబ్రవరి వరకు షూటింగ్ ను కంప్లీట్ చేసి.. వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలనే లక్ష్యంతో ఉన్నది. చిత్రం రిలీజ్‌కు నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్స్ షురూ చేసేందుకు ప్లాన్ చేస్తోంది యూనిట్.

ఈ మూవీ రిలీజ్ తరువాత మహేష్ బాబు.. సుకుమార్ కాంబినేషన్లో సినిమా ప్రారంభం అవుతుంది. కథకూడా ఒకే అయినట్టు తెలుస్తోంది. సుకుమార్ మహేష్ కోసం ఓ వినూత్నమైన కథను రెడీ చేశారని స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ కు జోడిగా ఎవరు నటిస్తారు అన్నదానిపై మొన్నటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.

మహేష్ సినిమాను హిందీలో కూడా విడుదల చేయాలంటే అక్కడి బాలీవుడ్ కు చెందిన వ్యక్తులను ఈ సినిమాలో భాగస్వామ్యం చేయాలని భావించిన సుకుమార్.. ఈ సినిమాకు హీరోయిన్ గా కత్రినా కైఫ్ ను రిఫర్ చేశారట. కత్రినాకైఫ్ కు మహేష్ ఓకే చెప్పాడు. ఆమె సైడ్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ప్రస్తుతం కత్రినా.. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ భారత్ అనే సినిమాలో నటిస్తోంది. తెలుగులో కత్రినా వెంకటేష్ తో మల్లీశ్వరి, బాలకృష్ణతో అల్లరి పిడుగు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.