మహేష్ సినిమా అప్పుడైనా మొదలవుతుందా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలుకావాలి కానీ మహేష్ ‘స్పైడర్’ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో కొరటాల స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకొని ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే రెండు సార్లు సినిమా షూటింగ్ మొదలవుతుందని డేట్స్ అనౌన్స్ చేశారు కానీ వర్కవుట్ కాలేదు. తాజాగా ఇప్పుడు మరో తేదీను ఫైనల్ చేసుకున్నారు.

మే 18నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. అయితే మహేష్ మాత్రం ఈ సినిమా సెట్స్ పైకి జూన్ నుండి జాయిన్ కానున్నాడు. ముందుగా హీరోయిన్ కైరా అద్వానీ, ఇతర నటీనటులపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మొదటగా సినిమా మొదటి షెడ్యూల్ ను లండన్ లో ప్లాన్ చేశారు కానీ మహేష్ అందుబాటులో లేకపోవడంతో ఇతర నటీనటులతో హైదరాబాద్ లోనే షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.