HomeTelugu Trendingచిరంజీవి సినిమాలో మహేష్‌ బాబు పాత్ర ఇదే!

చిరంజీవి సినిమాలో మహేష్‌ బాబు పాత్ర ఇదే!

2 28
టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో చిరంజీవి రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు ‘ఆచార్య’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నటిస్తున్నారని వార్తలు వస్తున్నవిషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ 45 నిమిషాల పాటు కనిపించనున్నారట. మహేష్ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడని టాక్‌. తాజాగా ఈ సినిమాకు సంబందించిన మరో వార్త ఒకటి హల్చల్ చేస్తుంది.

ఈ సినిమాలో మహేష్ కు ఒక పాట తో పాటు ఒక ఫైట్ కూడా ఉండనుందట. ఇక మహేష్ చిరంజీవి కలిసి సినిమాలో 15 నిముషాలు కనువిందు చేస్తారట. ఇప్పుడు మహేష్ సరసన హీరోయిన్ కోసం సర్చ్‌ చేస్తుందట చిత్రబృందం. మహేష్ పక్కన హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజ హెగ్డే పేరు ఎక్కువ వినిపిస్తుందట. మరి దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మహేష్ ఈ చిత్రానికి జూన్ నుండి కాల్ షీట్స్ కేటాయించే అవకాశముందని తెలుస్తుంది. రామ్ చరణ్, మాట్ని ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. చిరంజీవికి జంటగా త్రిష నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!