రాజమౌళి, సుకుమార్‌ గురించి క్లారిటీ ఇచ్చిన మహేష్‌

మహేష్‌ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా మే 9 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలు మాట్లాడారు.

ముఖ్యంగా సుకుమార్ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టడానికి గల కారణాలను ఈ ఇంటర్వ్యూలో మహేష్ చెప్పారు. మహర్షి తరువాత ఓ ఎంటర్టైనర్ సినిమా చేద్దామని అనుకున్నామని, కానీ, సుకుమార్ ఇంటెన్సివ్ స్టోరీతో ముందుకు రావడంతో ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినట్టు మహేష్ చెప్పారు. సుకుమార్ కూడా హ్యాపీగా ఫీలయ్యారని ఫ్యూచర్ లో ఇద్దరం కలిసి తప్పకుండా మరలా వర్క్ చేస్తామని అన్నారు. రాజమౌళితో సినిమా ఉంటుందని, దానిపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు మహేష్.

CLICK HERE!! For the aha Latest Updates