దీపావళికి ప్రారంభంకానున్న మహేష్‌ మల్టీప్లెక్స్‌!

టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగానే కాదు వ్యాపారవేత్తగా కూడ రాణిస్తున్నారు. ప్రముఖ థియేటర్ల చైన్ ఏషియన్ సినిమాస్ తో కలిసి ఆయన ఏఎంబి సినిమాస్ ను మొదలుపెట్టారు. ఈ సంస్థ యొక్క సినిమా హాళ్ల నిర్మాణం పూర్తైంది. హైదరాబాద్లో ఉన్న గచ్చిబౌలిలోని ఈ మల్టీప్లెక్స్ దీపావళి సందర్బంగా నవంబర్ 8న ప్రారంభంకానుంది. ఈ మల్టీప్లెక్స్ ను మహేష్ బాబు స్వయంగా ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ థియేటర్లలో మొదటగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ లు నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ ప్రదర్శితంకానుంది.

CLICK HERE!! For the aha Latest Updates