
Game Changer failure reasons:
ఏదైనా ఒక సినిమా సూపర్ హిట్ అయింది అంటే దాని వెనుక ఎందరో చేసిన కృషి ఉంటుంది. అలాగే ఏదైనా సినిమా ఫ్లాప్ అయింది అన్నా కూడా దాని వెనుక బోలెడు కారణాలు ఉంటాయి. అయితే తాజాగా సంక్రాంతి సందర్భంగా విడుదలైన మొట్టమొదటి సినిమా గేమ్ చేంజర్ ఫ్లాప్ అవ్వడానికి మాత్రం వందల కారణాలు ఉన్నాయి అంటూ ఫాన్స్ వాపోతున్నారు. ఒకటి రెండు చిన్న కారణాలవల్ల సినిమా ఫ్లాప్ అవలేదు అని.. కొందరు కావాలనే కుట్ర పన్ని మరి సినిమాని ఫ్లాప్ చేశారని టాక్ నడుస్తోంది. అందులో సినిమాపై అతి దారుణంగా ప్రభావం చూపించిన కొన్ని కారణాలను తెలుసుకుందాం.
Game Changer promotions:
సినిమా మీద భారీ అంచనాలు ఉన్నా కూడా చిత్ర బృందం సినిమాని సరిగ్గా ప్రమోట్ చేయలేకపోయింది. ఎక్కడెక్కడో సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టారు కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా ప్రమోషన్లు సరిగ్గా జరగలేదని.. సినిమా ఫ్యామిలీస్ ని అందుకే పెద్దగా ఎట్రాక్ట్ చేయలేక పోయింది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అందులో కూడా నిజం లేకపోలేదు.
Dil Raju:
సినిమా ప్రమోషన్స్ టైం లో దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలంగాణ దావత్ గురించి, అందులో ఉండే మటన్ గురించి చేసిన కామెంట్స్ చాలా వైరల్ అయ్యాయి. దీంతో తెలంగాణ వాసుల మనోభావాలు కొంతవరకు దెబ్బతిన్నాయి కూడా. ఆ తర్వాత దిల్ రాజు ప్రత్యేకంగా క్షమాపణలు చెబుతూ వీడియో చేశారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
Pawan Kalyan:
గేమ్ చేంజర్ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ప్రమోషన్స్ జరగలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అయితే ఎంత మెగా హీరో అయినప్పటికీ.. జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కూడా. పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ కారణంగా కొందరు వైసీపీ అభిమానులు సినిమా చూడలేదు అని టాక్ కూడా నడుస్తోంది.
Game Changer public talk:
సినిమా యావరేజ్ గా ఉన్నప్పటికీ మొదటి రోజు నుంచి సినిమా మీద నెగిటివ్ టాక్ వచ్చేసింది. సినిమా అతిపెద్ద డిజాస్టర్ అని శంకర్ మీద విపరీతంగా ట్రోల్స్ వచ్చేసాయి. ఈ నేపథ్యంలో సినిమా చూడాలి అనుకున్న వాళ్లు కూడా చాలామంది ఆగిపోయారు అని చెప్పుకోవచ్చు.
Game Changer piracy:
పైరసీ చాలా కాలంగా సినీ ఇండస్ట్రీని వెంటాడుతున్న ఒక పెనుభూతం. కానీ గేమ్ చేంజర్ విషయంలో మాత్రం ఇది అతి పెద్ద శాపం లాగా మారింది. సినిమా మొదటి షోలు పడ్డ గంటలోపే సినిమా హెచ్ డి ప్రింట్ ఆన్లైన్లోకి వచ్చేసింది. ఆఖరికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులలో కూడా టీవీలలో ఈ సినిమా ప్రసారం కావడం చాలా దురదృష్టకరం.
Game Changer ticket rates:
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్ల పెంపు కి అనుమతి వచ్చింది కానీ తెలంగాణలో మాత్రం ఆఖరి నిమిషంలో సినిమా టికెట్ రేట్లు పెరిగాయి. దీంతో అంతకుముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్లు మామూలు రేట్ లకే టికెట్లు కొనుగోలు చేశారు. పోనీ టికెట్ రేట్లు కనీసం వారం అయినా పెరిగాయా అంటే అది కూడా లేదు.. ఒకటి రెండు రోజులకు మించి తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపు కి అనుమతి ఇవ్వలేదు. దీని వల్ల కూడా కలెక్షన్లు తగ్గాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే గేమ్ చేంజర్ సినిమా విఫలమాపడానికి బోలెడు కారణాలు ఉన్నాయి. వరుసగా డిజాస్టర్లు అందుకుంటున్న శంకర్ కి ఈ సినిమా మరొకటి డిజాస్టర్ ఇచ్చింది. ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ సక్సెస్ తరువాత రామ్ చరణ్ సోలో హీరో గా వచ్చిన ఈ సినిమా మెగా అభిమానులను నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో కొందరు అభిమానులు కావాలనే సినిమా కూడా వాదిస్తున్నారు.