ఈ షాట్ గుర్తుంచుకోదగినదే.. కేటీఆర్‌ అన్నా కంగ్రాట్స్‌: మంచు మనోజ్

డిసెంబర్ 7న జరిగిన తెలంగాణా రాష్ట్ర ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్ లో భాగంగా టీఆర్‌ఎస్‌ పార్టీ 82 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం విశేషం. ఎలాంటి సపోర్ట్ లేకుండా మళ్లీ కె.సి.ఆర్ ఏకగ్రీవంగా ప్రభుత్వాన్ని ఏర్పటు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇక కౌంటింగ్ ప్రారంభం కాగానే కేటీఆర్‌ ట్విట్టర్ లో గన్ పెట్టి షూట్ చేస్తున్న పిక్ పెట్టారు. అయితే దీనికి విశేష స్పందన వస్తుంది. మంచు మనోజ్ ట్వీట్ చేస్తూ ఒక్క బుల్లెట్ తో అంతమందా.. ఆ షాట్ గుర్తుంచుకోదగినదే అంటూ.. కంగ్రాట్స్ కేటీఆర్‌ అన్నా అని ట్వీట్ చేశాడు.