‘అర్జున్ రెడ్డి’ బంపర్ ఆఫర్ కొట్టేశాడు!

‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో టాలీవుడ్ లో హీరోగా తన పరిధిని పెంచుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా తరువాత విజయ్ కు అభిమానుల సంఖ్య కూడా పెరిగిపోయింది. యువ హీరోలు సైతం ఎలాంటి స్వార్ధం లేకుండా .. విజయ్ నటనను పొగిడారు. ఈ విజయం కేవలంలో తెలుగుకి మాత్రమే పరిమితం కాకుండా ఇతర పరిశ్రమలకు కూడా పాకింది. ప్రస్తుతం మణిరత్నం.. విజయ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న విజయ్ వెంటనే సినిమాకు ఓకే చెప్పేశాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన ఓ అధికార ప్రకటన బయటకు వచ్చే అవకాశం ఉంది. మరో వైపు అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హిందీ సినిమాలో కూడా విజయ్ దేవరకొండనే హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయి. సో.. ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ లో కూడా తన పాగా వేయనున్నాడన్నమాట.