నితిన్ సినిమాకు మణిశర్మ మ్యూజిక్!

నితిన్ హీరోగా హనురాఘవపూడి దర్శకత్వంలో ‘లై’ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇది నితిన్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ. చాలా కాలం తరువాత ఓ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలోనే జరిగింది. ఈ సినిమాతో మేఘాఆకాష్ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇంత హైప్ ఉన్న సినిమాకు మణిశర్మను దర్శకుడిగా తీసుకున్నాడు నితిన్. దీంతో నితిన్ సెలెక్షన్ మీద అందరికీ అనుమానం కలుగుతోంది. 
ప్రస్తుతం మణిశర్మకు అంత క్రేజ్ లేదు. వరుస సినిమాలు చేస్తున్నాడు కానీ సరైన బ్రేక్ రావడం లేదు. ఈ మధ్య ఫ్యాషన్ డిజైనర్, అమీతుమీ వంటి చిన్న సినిమాలకు ఆయన సంగీతం అందించారు. అవి కూడా మణిశర్మకు పెద్దగా పేరు తీసుకురాలేదు. 
అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ను ఇప్పుడు నితిన్ తన సినిమా కోసం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నితిన్ కు అనూప్ రూబెన్స్ అంటే సెంటిమెంట్. అతడితో మరోసారి కూడా కలిసి పని చేయొచ్చు కానీ నితిన్ అలా చేయలేదు. ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా.. ఏరికోరి మరీ మణిశర్మను తీసుకున్నాడు నితిన్. మరి నితిన్ నమ్మకాన్ని మణిశర్మ నిలబెట్టుకుంటాడో..లేదో.. చూడాలి!