చైతు హీరోయిన్ ప్రేమయానం!

‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో అటు కోలీవుడ్ కు ఇటు టాలీవుడ్ కు పరిచయమయిన నటి మంజిమా మోహన్. ఆ తరువాత విక్రమ్ ప్రభుతో కలిసి ‘సత్రియన్’ అనే సినిమాలో నటించింది. గత కొన్ని రోజులుగా అమ్మడు ప్రేమలో పడిందంటూ ప్రచారం ఊపందుకుంది. ఇది రీల్ లైఫ్ న్యూస్ కాదండీ.. మంజిమా నిజంగానే ఓ వ్యక్తిని ప్రేమిస్తుందట. ఇంతకీ ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా..? నటుడు రిషిఖేష్. 
‘వేలైఇల్లా పట్టాదారి’ అనే తమిళ చిత్రంలో ధనుష్ కి తమ్ముడు పాత్రలో నటించిన రిషిఖేష్ తో ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం రిషి, మంజిమా పీకల్లోతు ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. చెన్నైలోని ఏ కాఫీ షాపులో చూసిన ఈ జంటే దర్శనమిస్తుందట. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. అయితే ఈ విషయంపై అటు రిషి కానీ, ఇటు మంజిమా కానీ ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా స్పందించకపోవడం గమనార్హం.