చిరు సినిమాకు తమన్ మ్యూజిక్..?

సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన తరువాత తమన్ చాలా మంది స్టార్ హీరోలతో కలిసి పని చేశారు. నిర్మాతలు కూడా తమన్ తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటాదానే ఉద్దేశంతో అతడినే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అయితే ఇప్పటివరకు మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా మ్యూజిక్ చేసిన తమన్ పిరియాడికల్ సినిమాను మాత్రం టచ్ చేయలేదు. త్వరలోనే ఈ జోనర్ లో కూడా సినిమా చేయబోతున్నట్లు సమాచారం.
 
చిరంజీవి తన 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాజెక్ట్ ను ఫైనల్ చేసారు. ఈ చిత్రానికి దర్శకుడిగా సురేందర్ రెడ్డి వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ సినిమా మొదలుకానుంది. అయితే ఇటీవల సురేందర్ ను కలిసిన తమన్ ఓ సెల్ఫీ దిగి ‘నా కిక్ నా రేసుగుర్రం.. వాట్ నెక్స్ట్’ అంటూ ఓ కామెంట్ చేశాడు.
 
దీంతో వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి పనిచేయబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పుడు సురేందర్ చేస్తోంది.. చిరు ప్రాజెక్ట్ కనుక ఇక ఈ సినిమా తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఫిక్స్ అయిపోవచ్చు. మరి ఈ చారిత్రాత్మక సినిమాకు తమన్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో.. చూడాలి!