అభిమాని ఫోన్‌ విసిరిగొట్టిన సూర్య తండ్రి.. వీడియో వైరల్‌

తమ అభిమాన నటుడు కనిపిస్తే చాలు సెల్ఫీల కోసం ఎగబడతారు ఫ్యాన్స్‌. అయితే కొంతమంది హీరోలు సున్నితంగా తిరస్కరిస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం చుక్కలు చూపిస్తారు. తన దగ్గరికి సెల్ఫీ కోసం వచ్చే అభిమానులను బాలయ్య ఏం చేస్తారో తెలిసిందే కదా. బాలయ్య తన అభిమానులను కొట్టిన వీడియోలు అప్పట్లో తెగ వైరల్‌ అయ్యాయి. దీంతో సోషల్‌ మీడియాలో బాలయ్యపై నెగెటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి. ఇక రీసెంట్‌గా సూర్య తండ్రి శివ కుమార్ తన టెంపర్‌ను ప్రదర్శించారు‌. షాప్‌ ఓపెనింగ్‌కు వచ్చిన శివ కుమార్‌.. సెల్ఫీ కోసం ప్రయత్నిస్తున్న అభిమాని ఫోన్‌ను విసిరిగొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. శివ కుమార్‌పై సోషల్‌ మీడియాలో నెగెటివ్‌ కామెంట్స్‌ వస్తున్నాయి.