న్యూయార్క్ లో బాయ్ ఫ్రెండ్ తో నయన్!

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార గతంలో శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం నడిపించిన సంగతి తెలిసిందే. తాజాగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ఆమె ప్రేమలో పడినట్లుగా వార్తలు వచ్చాయి. అవార్డ్ ఫంక్షన్లకు, అప్పుడప్పుడు విదేశాల టూర్లకు వీరిద్దరు కలిసి వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లుగా అయింది. ఇక విఘ్నేష్ కు నయన్ ఖరీదైన కార్ ను బహుమతిగా ఇచ్చిందని, తన కుటుంబ సభ్యులకు కూడా విఘ్నేష్ ను పరిచయం చేసిందనే వార్తలు కూడా వినిపించాయి.
తాజాగా వీరిద్దరు కలిసి న్యూయార్క్ వీధుల్లో షికారు చేస్తూ దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో మరోసారి ఈ జంట ప్రేమాయణం తెరపైకి వచ్చింది. మరోసారి ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. విఘ్నేష్ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ జంట న్యూయార్క్ వెళ్ళినట్లుగా తెలుస్తోంది. గతంలో విఘ్నేష్ కు ఓ ఇంటర్వ్యూలో నయన్ గురించి ప్రశ్న ఎదురవ్వగా.. ఆమెతో నా రిలేషన్ నా వ్యక్తిగతం. దాని గురించి మాట్లాడడానికి నేను సిద్ధంగా లేనని బదులిచ్చాడు. ఇప్పుడు చూడబోతే మాత్రం త్వరలోనే తమ పెళ్లి కబురుని వినిపించేలా ఉన్నారు ఈ జంట.