HomeTelugu Big Storiesబాలకృష్ణ సినిమాలో మీనా.. పాత్ర ఇదేనట!

బాలకృష్ణ సినిమాలో మీనా.. పాత్ర ఇదేనట!

Meena act in balakrishna go

టాలీవుడ్‌ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ‘అఖండ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అవకాశం వచ్చిందని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం అఖండ సినిమాల్లో బిజీగా ఉన్నా బాలయ్య.. ఈ సినిమాలో రెండు పాత్రలతో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా టీజర్ విడుదల కాగా నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను మే 28న విడుదల చేయడానికి సినీ బృందం ఇదివరకే ప్రకటించగా.. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడింది.

ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. యదార్థ ఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. మరో విషయం ఏంటంటే ఈ సినిమాలో కూడా బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కన్పించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఫ్యాక్షనిస్టు, పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ తో పాటు మరో సీనియర్ హీరోయిన్ నటించనుందట.

బాలయ్య సరసన ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శృతిహాసన్ అని సమాచారం అందగా.. మరో సీనియర్ హీరోయిన్ మీనా ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో మీనా బాలయ్య ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బాలయ్య జంటగా నటించనున్నట్లు తెలిసింది. ఇక ఈ సినిమా కోసం మీనా ను సంప్రదించగా.. తను కూడా ఓకే అన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయం గురించి ఇప్పటి వరకు సినీ బృందం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!