HomeTelugu Newsమెగా బ్రదర్ నాగబాబు 'విజిల్ షో'

మెగా బ్రదర్ నాగబాబు ‘విజిల్ షో’

Mega Brother Nagababu Vigil

కొత్తతరం హ్యాస్యనటులను ప్రోత్సహించేందుకు మెగా బ్రదర్ నాగబాబు డిజిటల్‌ మీడియా వేదికగా రెండు కొత్త షోలను ప్రారంభిస్తున్నారు. ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో ఈ షోలు ప్రసారం కానున్నాయి. ఇందులో ఒకటి స్టాండప్‌ కామెడీ షో, మరోటి కామెడీ స్కిట్స్‌తో కూడిన షో అని తెలిపారు. ఇప్పటికే స్టాండప్‌ కామెడీ షో ‘ఖుషీ ఖుషీగా’ వివరాలను జబర్దస్త్‌ నటుడు బుల్లెట్‌ భాస్కర్‌ వెల్లడించాడు. తాజాగా కామెడీ స్కిట్స్‌తో కూడిన షో వివరాలను గెటప్‌ శ్రీను ఓ వీడియో ద్వారా వివరించాడు. షో పేరు విజిల్‌.. ప్రీలోడెడ్‌. ఇందులో పాల్గొనడానికి ఎలాంటి స్కిట్స్ చేయాలి..? నిబంధనలు ఏంటి? తదితర విషయాలను వివరించాడు. జబర్దస్త్, అదిరింది తరహాలో స్కిట్‌లు చేయాలని భావించే వాళ్లకు అవకాశం కల్పిస్తూ సోషల్ మీడియాలో నాగబాబు కాంపిటేషన్ నిర్వహిస్తున్నారు. నాగబాబు ఆధ్వర్యంలోని జడ్జిమెంట్‌ ప్యానల్‌ చివరకు ఆరు టీమ్‌లను ఎంపిక చేసి వాటి మధ్య ఫైనల్‌ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. వీరికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అవకాశం కల్పించనున్నట్టు చెప్పారు. ఈ షోలో పాపులర్‌ కమెడియన్స్‌ కూడా పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu