మేనకోడలు శ్రావ్య ఫొటోను షేర్‌ చేసిన వర్మ .. !

వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ .. అంతా నాఇష్టం.. నాకు నచ్చిందే చేస్తా.. ఎవరేమనుకుంటే నాకేంటి.. నాకు నచ్చినట్టుగా సినిమా తీస్తా.. నచ్చితే చూడండి అని చెబుతుంటాడు. కాగా ప్రస్తుతం వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మార్చి 22 న విడుదల కాబోతున్నది. ఎన్నికలకు ముందు సినిమా రిలీజ్ కాబోతుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.

ఎప్పుడు ఏదోఒక వివాదాస్పద ట్వీట్స్ తో వార్తల్లో ఉండే వర్మ, గత కొంతకాలంగా తన ఫ్యామిలీతో టచ్ లో ఉంటున్నాడు. ఇటీవలే వర్మ తన కూతురు చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన కూతురితో కలిసి ఉన్న రోజులు బాగున్నాయని చెప్పి ట్వీట్ చేశారు. తాజాగా వర్మ తన మేనకోడలు శ్రావ్యవర్మతో కలిసి సరదాగా ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. శ్రావ్య వర్మ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ కు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తోంది. ముసలివాడినైనా నాకు మేనకోడలు డ్రెస్ డిజైన్ చేస్తానని అంటోంది అని చెప్పి ట్వీట్ చేశాడు. ఎప్పుడు ఫ్యామిలీ గురించి పెద్దగా మాట్లాడని వర్మ గత కొంతకాలంగా ఫ్యామిలీ గురించిన సమాచారాన్ని పంచుకుంటున్నాడు.