మెగాఫ్యామిలీకి బాగా అచ్చొచ్చినట్లుంది!

ఒక సినిమాను రిలీజ్ చేయడానికి ప్రస్తుతం పబ్లిసిటీ అనేది కీలకంగా మారింది. పబ్లిసిటీలో కూడా రోజుకో కొత్తదనాన్ని చూస్తున్నాం. ఇంతకముందు సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ సినిమాకు ప్రేక్షకులను రప్పించే విషయంలో ముఖ్య పాత్ర పోషించేది. కానీ రానురాను ఈ ఆడియో ఫంక్షన్స్ కు ఫుల్ స్టాప్ పెడుతూ.. నేరుగా మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. దీనికి బదులుగా ప్రీరిలీజ్ ఫంక్షన్స్ ను గ్రాండ్ గా జరిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ ట్రెండ్ ను మెగాఫ్యామిలీ మొదలుపెట్టిందనే చెప్పాలి.

అల్లు అర్జున్ ‘సరైనోడు’, అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’, రామ్ చరణ్ ‘ధృవ’,చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’, రీసెంట్ గా సాయి ధరం తేజ్ ‘విన్నర్’ సినిమాలు ఆడియోను నేరుగా మార్కెట్ లోకి విడుదల చేసి ప్రీరిలీజ్ ఫంక్షన్స్ ను గ్రాండ్ గా ఏర్పాటు చేసి సినిమా మీద హైప్ ను క్రియేట్ చేశారు. మొదటి నాలుగు సినిమాలు విజయాలను అందుకున్నాయి. మెగామేనల్లుడు
సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇలా ప్రీరిలీజ్ ఫంక్షన్స్ చేయడం మెగాఫ్యామిలీకు బాగా అచ్చొచ్చినట్లుంది. మెగా ఫ్యామిలీ కాకుండా హీరో నిఖిల్ ‘ఎక్కడకిపోతావు చిన్నవాడా’ సినిమాకు ప్రీరిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించాడు. ఇప్పుడు రాబోతున్న చాలా సినిమాలు ఇదే ఫార్ములాను కంటిన్యూ అయిపోతున్నారు.