అల్లు అర్జున్‌ అన్న పెళ్లి

అల్లు అరవింద్ పెద్ద కుమారుడు, అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్లోని ఐటిసి కోహినూర్ హోటల్లో ఈ వేడుక జరిగింది. ఆ కార్యక్రమానికి అల్లు కుటుంసభ్యులతో పాటు చిరంజీవి సతీమణి సురేఖ కూడా హాజరయ్యారు. వేడుకకు అతి కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. అల్లు బాబీ వివాహమాడిన అమ్మాయి పేరు నీల షా. ముంబైకి చెందిన ఈమె హైదరాబాద్ నగరంలో యోగా స్టూడియో నిర్వహిస్తోంది. ఆమె తండ్రి కమల్ కాంత్ ఒక వ్యాపారవేత్త. అయితే అన్న పెళ్లిలో అల్లు అర్జున్ మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మనార్హం. ఈయ‌న ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ సినిమాతో బిజీగా ఉన్నాడు.