40 ఏళ్లు పూర్తి చేసుకున్న చిరంజీవి, సురేఖ దాంపత్యం

కొణిదెల శివ శంకర వరప్రసాద్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి.. పునాది రాళ్లు సినిమాతో చిరంజీవిగా మారిపోయాడు. పునాది రాళ్లు తరువాత వరసగా చిన్న చిన్న పాత్రలు, నెగెటివ్ రోల్స్ చేస్తూ.. అవకాశాలు దక్కించుకున్నాడు. హీరోగా అవకాశం దక్కించుకొని హిట్ కొట్టి… అల్లు రామలింగయ్య దృష్టిని ఆకర్షించాడు చిరంజీవి.

భవిష్యత్తులో చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదుగుతాడని ముందుగానే గ్రహించిన అల్లు రామలింగయ్య.. ఆలస్యం చేయకుండా తన అల్లుడిని చేసుకున్నాడు. అల్లు ఇంటికి అల్లుడయ్యి నేటికీ 40 సంవత్సరాలు పూర్తయింది. 63 సంవత్సరాల వయసులో మెగాస్టార్ యువ హీరోలతో పోటీ పడి సినిమాలు చేస్తున్నాడు. ఖైదీ నెంబర్ 150 సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో తెలిసిందే. ప్రస్తుతం సైరా సినిమా చేస్తున్న మెగాస్టార్.. మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుందాం.