HomeTelugu Trendingపవన్‌ కళ్యాణ్‌ అభిమానిగా చిరంజీవి!

పవన్‌ కళ్యాణ్‌ అభిమానిగా చిరంజీవి!

Megastar Chiranjeevi as Paw

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలలో ”భోళా శంకర్” ఒకటి. ఇది తమిళ బ్లాక్ బస్టర్ ‘వేదాళమ్’ చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్. మెహర్ రమేష్ డైరెక్షన్‌లో రీమేక్ అయినప్పటికీ దర్శకుడు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా అనేక మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘స్వాగ్ ఆఫ్ భోళా’ పేరుతో విడుదల చేసిన గ్లిమ్స్ కు మెగా అభిమానుల నుంచి మంచి మంచి స్పందన వచ్చింది. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. అదేంటంటే చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాలో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపిస్తారట.

ఈ నేపథ్యంలోనే సినిమాలో పవన్ నటించిన ‘ఖుషి’ సీన్ ని రిపీట్ చేస్తున్నట్లు వినికిడి. పవన్ – భూమిక ల మధ్య వచ్చే నడుము సీన్ ఎంత హైలైట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అదే సన్నివేశాన్ని ‘భోళా శంకర్’ లో స్పూఫ్ గా వాడుతున్నారట. చిరంజీవి – యాంకర్ శ్రీముఖి మధ్య ఆ సీన్ రాబోతుందని అంటున్నారు. ఇందులో చిరంజీవి రొమాంటిక్ చూపులు – డైలాగ్స్ ఆ సన్నివేశంలో అదిరిపోయేలా వచ్చాయని.. అందుకు అనుగుణంగానే శ్రీముఖి హావభావాలు పలికించిందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయంలో కొందరు మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారని తెలుస్తోంది.

మెగాస్టార్ రేంజ్ ఏంటి.. తన తమ్ముడు పవన్ కు ఫ్యాన్ గా నటించడం ఏంటి.. ‘ఖుషి’ నడుము సీన్ స్పూఫ్ లో నటించడం ఏంటని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరి మెహర్ రమేష్ ఆ రొమాంటిక్ సన్నివేశాన్ని సినిమాలో ఉంచుతారో లేదో చూడాలి. ఇకపోతే సిస్టర్ సెంటిమెంట్ తో కూడిన పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘భోళా శంకర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తోంది. చిరు సోదరిగా మహానటి కీర్తి సురేష్ కనిపించనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!