చిరంజీవి, నయనతారపై రొమాంటిక్ సాంగ్..!


చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గతంలో కోకాపేటలో వేసిన సెట్ అగ్నిప్రమాదానికి గురి కావడంతో షూటింగ్ కాస్త ఆలస్యం అయింది. ఇదిలా ఉంటె ప్రస్తుతం సైరాలో ఓ సాంగ్ ను అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్ లో చిత్రీకరించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం, సెట్ లో షూట్ చేయబోతున్న సాంగ్ రొమాంటిక్ గా ఉండబోతుందని తెలుస్తోంది. నయనతార, మెగాస్టార్ లపై ఈ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సాంగ్ తరువాత తిరిగి కోకాపేట సెట్ లో మిగిలిన చిత్రీకరణ పూర్తిచేయనున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates